పల్నాడు జేసీగా సంజనా సింహా
ప్రత్యేక దృష్టితో సమస్యలు పరిష్కరించండి
నరసరావుపేట: పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి.సంజనా సింహాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీ ల్లో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సింహాను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఇక్కడ జేసీగా పనిచేస్తున్న సూరజ్ గనోరేను నవంబర్ నెలలో రాష్ట్ర ఆర్థిక విభాగానికి బదిలీ చేశారు. అప్పటి నుంచి జాయింట్ కలెక్టర్ బాధ్యతలను కూడా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లానే నిర్వర్తిస్తున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్, జేసీ ఇరువురు మహిళలు కావడం గమనార్హం. సంజనా సింహా 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో బీటెక్ చేశారు. సివిల్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 142 అర్జీలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నకరికల్లు మండలం గుండ్లపల్లిలో 700 చదరపు గజాల స్థలంలో ఇల్లు నా తమ్ముడు అడపా వెంకటరెడ్డి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నా స్వాధీనంలోనే ఉండగా మాకు తెలియకుండా వెంకటరెడ్డి కుమారుడు రామిరెడ్డి నేను మృతి చెందానంటూ ఇంటికి చెందిన విద్యుత్ మీటరు, ఇంటి పన్ను తన పేరుపై మార్పు చేసుకున్నాడు. నా ఇంటి దస్తావేజులు, ఇతర ఆధారాలను పరిశీలించి అతడి పేరుపై ఉన్న ఇంటి పన్ను, విద్యుత్ మీటరును రద్దుచేసి అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి.
–అడపా లచ్చిరెడ్డి, రెంటచింతల
గ్రామంలోని బీసీకాలనీలో మూడు సెంట్ల స్థలాన్ని 20 ఏళ్ల కిందట కొనుగోలు చేశారు. అందులో రేకుల షెడ్డు వేశాను. ఆ ఇంటి వెనుక వైపున ఉన్న వ్యక్తి కోసం నా స్థలంలో గుండా రోడ్డు వేశారు. అదేమని అడిగితే కొట్టబోయారు. సమస్య పరిష్కరించాలని చంద్రబాబుని ఇప్పటికి ఆరుసార్లు కలిశా. నీవు బీఫాం స్థలం కొన్నావు..దానిని రద్దు చేస్తామని ఆర్‌డీఓ చెబుతున్నారు. అంతకు మించి నాకు ఎటువంటి ఆధారం లేదు. దయచేసి ఆ రోడ్డును తొలగించి నా స్థలం నాకు ఇప్పించి న్యాయం చేయండి.
–జంపని అన్నపూర్ణమ్మ, యడ్లపాడు గ్రామం
పొలం పనులు చేసుకొని జీవించే నాకు ఏడాదిన్నర కిందట పక్షవాతం వచ్చింది. కాలు, చేయి పడిపోయింది. నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏ పనిచేసుకొని జీవించే పరిస్థితిలేదు. ఆర్థిక ఇబ్బందులతో నా కుటుంబం బాధపడుతుంది. నాకు పింఛన్ మంజూరుచేసి న్యాయం చేయండి.
–రెడ్డిబోయిన బాలాంజనేయులు,
నిండుజర్ల, అచ్చంపేట మండలం
పల్నాడు జేసీగా సంజనా సింహా
పల్నాడు జేసీగా సంజనా సింహా
పల్నాడు జేసీగా సంజనా సింహా
పల్నాడు జేసీగా సంజనా సింహా


