రామావతారం అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్‌లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రీవారికి రామావతారం అలంకరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పాశురాలను పఠించారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీవారి సేవా సమాజం ఏర్పాట్లను పర్య వేక్షించారు.
భక్తులు సమర్పించిన వస్త్రాల వేలం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ఎగువ, దిగువ సన్నిధిల్లో శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన వస్త్రాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14, 15వ తేదీలలో ఉదయం 9 గంటల నుంచి దిగువ సన్నిధిలోని ఆలయంలో వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు పాల్గొనాలని పేర్కొన్నారు.
స్వదేశీ నినాదాన్ని చాటిన మహనీయుడు వివేకానంద
మంగళగిరి టౌన్ : స్వదేశీ నినాదాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలోని స్వామి వివేకానంద స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వర్శిటీ పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తిని నాటడంలో వివేకానంద చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, వర్శిటీ ఆర్ట్స్, కామర్స్ లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్‌కుమార్, పలువురు ఆచార్యులు లింగరాజు, తేజామూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం వివరాలు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 556.00 అడుగులకు చేరింది. ఇది 223.1910 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,800, ఎడమ కాలువకు 7,272, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 26,704, ఎస్ఎల్బీసీకి 1,650, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది.జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 45,726 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 33,098 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
భక్తిశ్రద్ధలతో
మహా పూర్ణాహుతి
నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరుబృందావన్ గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆల య ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞా న పరిషత్, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పాలకమండలి సంయుక్త ఆధ్వర్యంలో విశ్వశాంతి, లోక కల్యాణాలను కాంక్షిస్తూ సోమవారం చండీహోమం మహా పూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు.
రామావతారం అలంకరణలో శ్రీవారు
రామావతారం అలంకరణలో శ్రీవారు
రామావతారం అలంకరణలో శ్రీవారు


