అప్పుల బాధతో యువకుడు బలవన్మరణం
సత్తెనపల్లి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పాతబస్టాండ్ సమీపంలోని శ్రీకృష్ణా లాడ్జిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు... గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ (31) గత కొన్ని సంవత్సరాలుగా వెండి వస్తువులు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంత అప్పులయ్యాయి. తీరే మార్గం కనిపించక మనస్తాపం చెందిన అబ్దుల్ అజీజ్ ఈ నెల 9న సాయంత్రం సత్తెనపల్లిలోని శ్రీకృష్ణా లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. శనివారం రాత్రి నుంచి తలుపు తీయకపోవడంతో ఆదివారం ఉదయం అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జె.రాజశేఖర్, సిబ్బంది వచ్చి డోర్ పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు దుప్పటితో అతడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.


