మట్టి నమూనా విశ్లేషణలో సాంకేతికత కీలకం
కేసీ స్కూల్స్ తపాలా పోస్టల్ కవర్ ఆవిష్కరణ
కొరిటెపాడు: గుంటూరు నగరంలోని భూసార పరీక్షా కేంద్ర ప్రయోగశాలను శనివారం రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డాక్టర్ మనజీర్ జిలానీసమూన్ సందర్శించారు. ప్రయోగశాలలో మట్టి నమూనాల విశ్లేషణను పరిశీలించారు. మట్టి నమూనాల స్వీకరణ నుంచి విశ్లేషణలో స్థూల, సూష్మ పోషకాలలో 12 రకాల వివిధ అంశాలకు సంబందించి విశ్లేషణ, పరికరాల పనిచేసే విధానం, చివరగా పరీక్షా ఫలితాలను సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్‌లో నమోదు చేసే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రక్రియను పూర్తిగా విపులంగా పరిశీలించారు. భూసార ఆరోగ్య పత్రం (సాయిల్ హెల్త్ కార్డు)ను పరిశీలించి, మట్టి పరీక్షా డేటా ఆధారంగా రైతులకు పంటల వారీగా ఎరువుల సిఫార్సులు ఏ విధంగా అందిస్తున్నారనేది వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసార పరీక్ష కేంద్రంల ద్వారా రైతులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లా ప్రయోగశాలల కొత్త భవనాల నిర్మాణానికి, తొమ్మిది కొత్త జిల్లాల్లోని భవనాల మరమ్మతులకు భూ ఆరోగ్య భూసార పథకం కింద మంజూరైన రూ.3.18 కోట్ల నిధులను సత్వరమే వినియోగించాలని ఆదేశించారు.
పట్టాదారు
పాసు పుస్తకాల పంపిణీ
మేడికొండూరు: మేడికొండూరులో పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మేడికొండూరు మండలం విశదల, వెలువర్తి, డోకిపర్రు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకంపై గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈకేవైసీ పూర్తి అయ్యాకే పాసు పుస్తకం ముద్రించి జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 35,690 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, మేడికొండూరు తహసీల్దార్ గాలం రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.
మాదల (ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ శనివారం తెలిపారు. అందిన సమాచారం మేరకు... పొలాల్లో పేకాట అడుతున్నారనే విషయం తెలియడంతో పోలీసు సిబ్బందితో కలిసి ఎస్‌ఐ వెళ్లి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేవారు. వారి నుంచి రూ. మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని కొండవీటి కమిటీ స్కూల్స్ (కేసీ స్కూల్స్) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక తపాలా పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ విద్యాభివర్థనీ సంఘంను 1925 డిసెంబరు 25న 1925న స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాల ప్రారంభమైంది. ఈ సంస్థ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 11వ తేదీన ఆదివారం శత వసంతాల పండుగ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక తపాలా కవర్‌ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు కేసీ స్కూల్స్ కరస్పాండెంట్ గాదె సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, మాదిరెడ్డి హనుమారెడ్డి, కాశింరెడ్డి పాల్గొన్నారు. పోస్టల్ అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
క్రోసూరు: మండలంలోని హసనాబాద్ గ్రామంలో ఈ నెల 4వ తేదీన విద్యార్థి షేక్ ముజావర్ ఖలీల్ (11) అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో అతడి ముగ్గురు స్నేహితులే అసలు నిందితులని తేలినట్లు ఎస్‌ఐ పి.రవిబాబు శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... స్నేహితులు ముగ్గురు రేగుపండ్లు కోసం వెళ్లేటప్పుడు ముందుగానే కర్ర, చాకు వెంట తీసుకెళ్లారని తెలిపారు. ఆ సమయంలో పాత విషయాలు, తిట్టుకున్నవి, అనుకున్న మాటలు లేవనెత్తి ముగ్గురు కలిసి హత్య చేసినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. వీరు గ్రామంలోని ఎంపీ యూపీ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులని అన్నారు. నిందితులను అరెస్ట్ చేసి గుంటూరు కోర్టులో హాజరుపరిచాక విజయవాడ జువైనల్ షెల్టర్ హోంకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మట్టి నమూనా విశ్లేషణలో సాంకేతికత కీలకం


