గంజాయి కేసుల్లో 11 మంది అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో 11 మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం అంకమ్మనగర్ ఇరిగేషన్ విభాగం కార్యాలయం వెనుక ఖాళీస్థలంలో నగరంపాలెం పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. అదే రోజు రాత్రి లాల్‌పురం డొంకరోడ్డులోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని ఖాళీ స్థలంలోనూ తనిఖీలు కొనసాగాయన్నారు. ఈ క్రమంలో వారి వద్ద గంజాయి గుర్తించారన్నారు. దీంతో మొదటి కేసులో కొరిటెపాడు నాయుడుపేట మూడో వీధిలో ఉంటున్న మేడూరి హేమసాయిచంద్ అలియాస్ చందు, గౌతమీనగర్ మూడో వీధికి చెందిన ముత్తుకూరి సాయిరామ్, తన్నీరు నాగసాయి, హనుమయ్యనగర్ రెండు, మూడు వీధుల్లో ఉంటున్న మేళం ఏసుమూర్తి, షేక్.జానీబాషా, జొన్నలగడ్డ యువరాజుని రెండో కేసులో శ్రీనివాసరావుపేట అరవై అడుగుల రోడ్డులో ఉంటున్న పాలేటి సాల్మన్‌రాజు, నగరంపాలెం ఒకటో వీధికి చెందిన గుంజి హేమంత్‌రాజు, శ్రీనివాసరావుపేట 12వ వీధికి చెందిన సుంకర వంశీకృష్ణ, పట్టాభిపురం రెండో వీధిలో ఉంటున్న పాముల రఘురామ్, అడపాబజార్‌కు చెందిన షేక్ నాగుల్‌మీరాలను అరెస్ట్ చేశామన్నారు. ఆయా కేసుల్లో 4.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ఈ కేసులు చేధించిన నగరంపాలెం పీఎస్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు పి.రాంబాబు, రామచంద్రరెడ్డి, హెచ్‌సీ ఎం.దాసు, కానిస్టేబుళ్లు ఎస్‌కే.జాన్‌సైదా, శ్రీనివాసరావు, సిహెచ్.ఉదయచంద్, పి.గంగరాజు, ఎస్‌కె.షకీల్‌అహ్మద్, టాస్క్‌ఫోర్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. మీడియా సమావేశంలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ పాల్గొన్నారు.
పట్టుబడిన వారి వయస్సు 30 ఏళ్లలోపే..
వీరిలో ఏడుగురు పాత నేరస్తులు
4.4 కిలోల గంజాయి స్వాధీనం
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి


