కలెక్టరేట్‌లో అరకు కాఫీ స్టాల్
నరసరావుపేట:ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీ అరోమా ను జిల్లా ప్రజలకు పరిచయం చేస్తూ పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభమైంది. శుక్రవారం కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కలెక్టరేట్ ప్రాంగణం ఎదుట ఏర్పాటుచేసిన అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద స్టేట్ బ్యాంకు ఇండియా బ్యాంకు (ఎస్‌బీఐ) రుణ సహాయం ద్వారా స్టాల్‌ను దక్కించుకున్న లబ్ధిదారురాలు గోనుగుంట్ల భార్గవిని కలెక్టర్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుకోవాలని ఎంపీ లావు అన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, డీఆర్‌డీఎ పీడీ ఝాన్సీరాణి, టీడీపీ, జనసేన నాయకులు ఎన్.రాము, సయ్యద్ జిలాని ఉన్నారు.


