ప్రకృతి క్షేత్రాలను సందర్శించిన ఢిల్లీ బృందం
బెల్లంకొండ: మండలంలోని పలు గ్రామాలలో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, కార్యక్రమాలను న్యూఢిల్లీకి చెందిన వేవర్లి స్ట్రీట్ ఫౌండేషన్ బృందం గురువారం సందర్శించింది. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్, సంస్థ ప్రతినిధులు జర్నైల్‌సింగ్, రోహిణి చతుర్వేదిలు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారితో కలిసి వివిధ ప్రకృతి వ్యవసాయ మోడళ్లను, క్షేత్రాలను పరిశీలన చేశారు. మొదట మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలోని బయో ఇన్‌పుట్స్ రిసోర్స్ సెంటర్‌ను సందర్శించి, జిల్లా వ్యాప్తంగా రైతులకు బయో ఇన్‌పుట్స్ సరఫరా చేస్తున్న రైతులు నరసింహారావు, సావిత్రిలను అభినందించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా అమలవుతున్న ఏనీ టైమ్ మనీ మోడల్, న్యూట్రి గార్డెన్, సూర్య మండలం మోడల్, కమ్యూనిటీ న్యూట్రి గార్డెన్లను పరిశీలించారు. బెల్లంకొండ రైతు సేవా కేంద్రంను సందర్శించిన బృందం, రైతులతో పాటు సిబ్బందితో ప్రకృతి వ్యవసాయ విధానాలు, ఆరోగ్యం–పోషణ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది మురళి, తారా, వి.వాణిశ్రీ, ముఖేష్, స్థానిక సిబ్బంది అనంతలక్ష్మి, సైదయ్య, అంజలి రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
నిబంధనలకు లోబడి విక్రయాలు జరపాలి
సత్తెనపల్లి: ఎరువుల డీలర్ల ద్వారా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎరువుల విక్రయాలు జరపాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎమ్.జగ్గారావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సత్తెనపల్లి, ముప్పాళ్ల, పెదకూరపాడు మండలాలకు సంబంధించిన ఎరువుల డీలర్లకు ఎరువుల నియంత్రణ చట్టంపై గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి సత్తెనపల్లి సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి.రవిబాబు అధ్యక్షత వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు మాట్లాడుతూ ఎరువుల కంపెనీలకు సంబంధించిన ఫారం ‘0’లను ఎరువుల లైసెనన్స్‌లో పొందుపరచుకోవాలన్నారు. రైతులకు ఎరువుల అమ్మకాలు జరిపినప్పుడు తప్పనిసరిగా రైతులకు బిల్లును ఇవ్వా లన్నారు. యూరియా లభ్యత వివరాలు కూడా డిస్‌ప్లే బోర్డు నందు పొందుపరచా లని, గరిష్ట చిల్లఽర ధరకు మించి ఎరువులు అమ్మకాలు జరపరాదన్నారు. ఎరువుల అమ్మకాలు జరిపిన వెంటనే ఈ–పాస్ మిషన్‌లో కూడా అమ్మకాలు పూర్తి చేయాల న్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సత్తెనపల్లి, ముప్పాల్ల, పెదకూరపాడు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు బి సుబ్బారెడ్డి, ఎస్ శ్రీధర్‌రెడ్డి, కృష్ణయ్య, సంహిత సాయిల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, మూడు మండలాల ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
ప్రకృతి క్షేత్రాలను సందర్శించిన ఢిల్లీ బృందం


