మట్టి కుస్తీ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి
చిలకలూరిపేట: రాష్ట్ర స్థాయి మట్టి కుస్తీపోటీలు ఈనెల 25, 26 తేదీల్లో చిలకలూరిపేటలోని ఆర్‌వీఎస్ సీవీఎస్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ వీరాంజనేయ మల్లయుద్ద వ్యాయామశాల అధ్యక్షుడు పేరుబోయిన వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు తెలిపారు. పట్టణంలోని ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇండియన్ స్లైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. బరువును బట్టి సీనియర్ పురుషుల కేటగిరిలో 55, 60, 65, 70, 75, 80, 85 కేజీల విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. సీనియర్ ఉమెన్ విబాగంలో 48, 52, 56, 62 విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. జూనియర్ బాయ్స్‌లో 52, 57, 61, 65, 74, 86 విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. జూనియర్ మహిళల్లో 46, 50, 54, 58, 62, 65 కేజీల విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. సీనియర్ పహిల్వాన్‌లకు వయసు 19 నుంచి 20 సంవత్సరాలు ఉండాలని, అదే జూనియర్‌లకు 16 నుంచి 19 సంవత్సరాల వయసు ఉండాలని తెలిపారు. పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆధార్‌కార్డుతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఈ నెల 24లోపు వ్యాయమశాల కార్యదర్శి పేరుబోయిన మావో శ్రీనివాసరావుకు అందజేయాలన్నారు. సెల్ నంబర్ 9391077411 కు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 7396225080 నంబర్‌ను సంప్రదించాలన్నారు. సమావేశంలో వ్యాయామశాల కార్యదర్శి బత్తుల సుబ్బారావు, కోశాధికారి సాపా వీరరాఘవులు, మజ్ను పహిల్వాన్ పాల్గొన్నారు.


