పల్నాడు
న్యూస్‌రీల్
విద్యార్థులు తక్కువగా ఉన్నారని సాకు రహస్యంగా వివరాల సేకరణకు అధికారులు ఆదేశం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన జిల్లాలో 32 పాఠశాలలో ఐదుగురి కంటే తక్కువ విద్యార్థులు
ఇది జిల్లాలో పరిస్థితి..
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
చేబ్రోలు: నారాకోడూరులోని గాయత్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో నిర్మించిన డీ–అడిక్షన్ సెంటర్‌ను
హరియాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు.
సత్తెనపల్లి: ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందా .. తగి నంత మంది విద్యార్థులు లేరనే సాకుతో బడులను మూసివేసేందుకు కుట్ర పన్ను తోందా ..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు రెండ్రోజుల కిందట అన్ని జిల్లాలు, మండలాల విద్యాశాఖ అధి కారులతో వెబ్‌క్స్ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య ఐదు లోపు ఉన్న ఫౌండేషన్ స్కూళ్లు, పదిలోపు ఉన్న బేసిక్ స్కూళ్లు, 30 లోపు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య 50 లోపు ఉన్న హైస్కూళ్ల వివరాలు సేకరించాలని మౌఖిక ఆదే శాలు జారీ చేశారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో కొన్ని పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఏయే స్కూళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది? వాటిని సమీపంలోని ఏ స్కూల్‌లో విలీనం చేస్తే బాగుంటుంది? అనే వివరాలను సేకరించి తమకు అందజేయాలని సూచించడం ఉపాధ్యాయ వర్గాలలో గుబులు రేపుతోంది. 3,4,5 తరగతుల విద్యార్థులను కిలోమీటర్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోకి విద్యాశాఖ పంపేసింది. ఈ ప్రక్రియతో చాలా పాఠశాలలు మూత పడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం 3,4,5 తరగతులను విలీనం చేసింది. ఈ విధానం వల్ల చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు సమాచారం.
పరిష్కారం వెతక్కుండా .. రద్దు చేయడమేంటి?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నా యని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడానికి ప్రధాన కారణంగా ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి, మేధావులు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, సంఘాల నేతలతో చర్చించి ఆ దిశగా అడుగులు వేయకుండా ‘విలీనం’ పేరుతో రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో 361 బడులు సింగిల్ టీచర్‌కే పరిమితం...
జిల్లా వ్యాప్తంగా 361 పాఠశాలలు సింగిల్ టీచర్ (ఏకోపాధ్యాయ)కే పరిమితమ య్యాయి. ఆ పాఠశాలలో బోధన చేసే ఉపాధ్యాయుడు ఏదైనా సమస్యల కారణంగా విధులకు రాకపోతే పాఠశాల మూతపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే సమస్యలు తలెత్తనున్నాయి. డీఎస్సీ ఉపాధ్యాయులతో కొన్ని సింగిల్ టీచర్ పాఠశాలల్లో బోధనా సమస్యలు తీరుతాయని భావించినప్పటికీ ఖాళీల భర్తీలో ఆ పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి.
లోకేశ్ మాటలపై సన్నగిల్లిన నమ్మకం
ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పదే పదే చెబుతున్నా .. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన మాటలపై నమ్మకం సన్నగిల్లుతోందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ‘విలీనం’ పేరుతో విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు తాళం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఉపాధ్యాయులు అంటున్నారు.
జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని పలు పాఠశాలలను తక్కువ విద్యార్థుల సాకుతో మూసివేతకు రహస్యంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 32 పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఐదుగురి కంటే తక్కువ ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో కసరత్తు నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదికలు పంపేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు ...
పాఠశాల స్థాయి పాఠశాలలు విద్యార్థులు
ప్రాథమిక 1,215 52,791
ప్రాథమికోన్నత 54 4,580
ఉన్నత 298 86,991
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


