● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుం
పాటిబండ్లకు ఆధ్యాత్మిక శోభ
పెదకూరపాడు: పాటిబండ్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ విరజల్లుతుంది. ముగ్గురు రాజుల దేవాలయం తిరునాళ్లకు సిద్ధమైంది. తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాలలో ఉన్న మత గురువులు, మతకన్యలు, క్రైస్తవ సోదరులతో రానున్నారు. ఆదర్శవంతమైన సంఘంగా, విశ్వాసానికి ప్రత్యేకంగా పాటిబండ్లలో నిర్మించిన ముగ్గురు రాజుల దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. హాలెండ్‌లోని మిల్ హిల్ సభకు చెందిన మత గురువు ఫాదర్ గ్లైస్మాన్ 1921లో ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఇక్కడ ముగ్గురు రాజుల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఆలయంలో శిల్ప కళలు చూపర్లను కట్టిపడేస్తాయి. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 5,6,7 తేదీలతో ముగుస్తాయి. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యేక దివ్య పూజ నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించే మహోత్సవంలో గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య ప్రత్యేక దివ్య పూజ నిర్వహించనున్నారు. మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక విచారణ గురువులు చిన్నాబత్తిన హృదయరాజు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పెదకూరపాడు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు.


