కార్గో సర్వీసుల ద్వారా...
తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న నకిలీ మందులు రెగ్యులర్ పురుగుమందులు వచ్చే పార్శిల్ సర్వీసుల్లో కాకుండా వివిధ రకాల ట్రాన్స్‌పోర్టు కంపెనీ ద్వారా పల్నాడు జిల్లాలోకి చేరవేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా పురుగుమందులు రవాణా అవుతున్నాయి. వీటిని పట్టుకుంటున్న విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు శాంపిల్స్ తీసి ల్యాబ్‌లకు పంపుతున్నారు. మరోవైపు కొంతమంది తెలంగాణకు చెందిన డిస్టిబ్యూటర్లు జీఎస్టీ పన్నులు కట్టకుండా అక్రమంగా రాష్ట్రంలోకి తరలించి తమ సేల్స్‌ను పెంచుకొని లాభపడుతున్నారు. వీటి వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడటంతోపాటు రైతులకు బిల్లులు అందక నష్టపరిహారానికి అనర్హులవుతారు. అధిక లాభాలకు ఆశపడ్డ కొందరు వ్యాపారులు ఈ నకిలీ, బిల్లులులేని మందులను రైతులకు అంటగడుతున్నారు.


