గంజాయి ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా అరెస్టు

Jan 6 2026 7:53 AM | Updated on Jan 6 2026 7:53 AM

గంజాయి ముఠా అరెస్టు

గంజాయి ముఠా అరెస్టు

6.4 కిలోల గంజాయి స్వాధీనం ఏడుగురు నిందితులు అరెస్టు – ఇద్దరు పరారీ వివరాలు వెల్లడించిన గురజాల డీఎస్పీ జగదీష్‌

పిడుగురాళ్ల: గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బీఎల్‌ఎన్‌ జగదీష్‌ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గురజాల డీఎస్పీ బీఎల్‌ఎన్‌ జగదీష్‌ మాట్లాడుతూ పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల 400 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పట్టణ సీఐ ఎస్‌ వెంకట్రావు, ఎస్‌ఐ డి.శివనాగరాజుల బృందం చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. వారిలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వెన్ను తిరుమలరావు, సాదుపాటి రాజేష్‌, నున్సావత్‌ శివకుమార్‌, సాదుపాటి గోపి, కొండమోడుకు చెందిన షేక్‌ బాబావలి, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన తాడిమళ్ల దివ్యబాల, డేగల శిరిష వీరికి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ శివారు కళ్లం టౌన్‌షిప్‌ పరిధిలో 60 అడుగుల రోడ్డు చివర పడమర వైపు కొంత మంది గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో సీఐ వెంకట్రావు, ఎస్‌ఐ శివనాగరాజులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకాలు వినియోగిస్తున్న స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు దాచేపల్లి పట్టణానికి చెందిన సాకేటి తిరుపతినారం నాయుడు, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన మామిడిశెట్టి మణికంఠలు పరారీలో ఉన్నారు. వీరు విశాఖపట్నం, ఒడిస్సాలో ప్రాంతాల నుంచి కిలో గంజాయిని కిలో రూ. 5000 వేలకు కొనుగోలు చేసి దానిని అరెస్టు అయిన ఏడుగురికి కిలో రూ.10 వేల చొప్పున అమ్మేవారు. ఈ ఏడుగురు పది గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్‌ కవర్లలో పెట్టి పది గ్రాముల గంజాయి ప్యాకెట్‌ రూ.300లకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే వీరిపై గంజాయి కేసులు వంటి పలు కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, యువత భవిష్యత్‌కు, సమాజానికి తీవ్ర ప్రమాదమని డీఎస్పీ జగదీష్‌ హెచ్చరించారు. నిషేధిత మాదకద్రవ్యాల కొనుగోలు, విక్రయం, రవాణా కలిగి ఉండటం చట్టపరంగా తీవ్రమైన నేరమని, ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదని తెలిపారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తక్షణమే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం గంజాయిని పట్టుకున్న సీఐ, ఎస్‌ఐను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఎస్‌.వెంకట్రావు, ఎస్‌ఐలు బి.శివనాగరాజు, ఎం.మోహన్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement