పవర్ లిఫ్టింగ్, బెంచ్‌ప్రెస్ పోటీలకు రాష్ట్ర జట్టు ఎ
సత్తెనపల్లి: హరియాణాలో ఈ నెల 7వ తేదీ నుంచి 11 వరకు జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ పోటీల రాష్ట్ర జట్టును పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పవర్ హౌస్ ఫిట్నెస్ నందు సోమవారం ఎంపిక చేశారు. ఇక్కడ ఎంపికై న జట్టు జాతీయ స్థాయిలో జరిగే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ అండ్ ఉమెన్ ఏక్విప్పెడ్ అండ్ అన్ ఏక్విప్పెడ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పల్నాడు జిల్లా సెక్రెటరీ పసుపులేటి సురేష్ తెలిపారు. సబ్ జూనియర్ విభాగం నుంచి 53 కేజీల్లో కత్తి కార్తీక్(గురజాల), 74 కేజీల్లో షేక్ మొహిద్దిన్ (సత్తెనపల్లి), జూనియర్ విభాగం నుంచి 83 కేజీల్లో పసుపులేటి వంశీ కృష్ణా (సత్తెనపల్లి), 120 కేజీల్లో లింగిశెట్టి శివ నాగేశ్వరరావు(సత్తెనపల్లి) ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి బాధ్యులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ జిమ్ము రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్య, తదితరులు ఉన్నారు.


