రొంపిచర్లలో విజిలెన్స్ దాడులు
50 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
నరసరావుపేట టౌన్: అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రొంపిచర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామం నుంచి రామిరెడ్డిపాలెం వైపు అక్రమంగా మినీ లారీలో బియ్యం రవాణా చేస్తున్నారన్నా సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 50 బస్తాల బియ్యాన్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావుకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మంగళగిరిటౌన్: త్వరలో జరగనున్న సౌత్‌జోన్ ఆలిండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్‌కు సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని స్టోర్స్ ఐజీపీ ఏవీ మోహనరావు తెలిపారు. మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏపీ పోలీస్ స్టేట్ టి–20 సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఈ సెలక్షన్లు జనవరి 5 నుంచి 11వ తేదీ వరకు మంగళగిరి స్టేడియం, మూలపాడు స్టేడియంలలో జరగనున్నట్లు పేర్కొన్నారు.


