సెమీ ఫైనల్స్‌కు కేఎల్‌యూ జట్టు
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్–2026 పోటీలు సోమవారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ.. ఎనిమిది జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయని తెలిపారు. సెమీ ఫైనల్స్ క్రీడలు రాత్రి కూడా జరగనున్నాయని.. సోమవారం సాయంత్రం 5వ రౌండ్ పూర్తయ్యే సమయానికి కేఎల్‌యూ జట్టు చైన్నెకు చెందిన భారతీయార్ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్స్‌లో తలపడనుందని తెలిపారు. జేఎన్‌టీయూ కాకినాడ జట్టుపై కేరళకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ విజయం సాధించిందని పేర్కొన్నారు. వీటితో పాటు మరో ఆరు జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడుతున్నాయని.. సెమీ ఫైనల్స్ ముగిసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు వివరించారు.


