అమెరికాలో వాలీబాల్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్ : అమెరికాలో ఎంసీఏఏ ఆధ్వర్యాన జాతీయ స్థాయిలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే టీమ్‌కు మంగళగిరి క్రీడాకారుడు ఎంపికయ్యాడు. స్ధానిక వివిధ పార్టీల నాయకులు క్రీడాకారుడు ఈశ్వర్‌ను సోమవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురుమాట్లాడుతూ జనవరి నుంచి మే వరకు అమెరికాలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన పొండుగల ఈశ్వర్ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈశ్వర్ అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే విద్యను అభ్యసిస్తూ, ఆ దేశంలో జరిగే వాలీబాల్ పోటీలకు పెప్పర్ డైన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపికయ్యాడని తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే పోటీలలో ఈశ్వర్ టీమ్ తలపడనుందని, గ్రామానికే కాక రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఈశ్వర్ క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.


