జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
సత్తెనపల్లి: జాతీయ స్థాయి ఇండియన్ ఖేలో ఫుట్‌బాల్ పోటీలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి శివ సాయి ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికై నట్లు కోచ్ పాలపర్తి సురేష్ సోమవారం తెలిపారు. గత నెల 21 నుంచి 23 వరకు బెంగళూరులో జరిగిన జోనల్ పోటీల్లో నల్లగొండ రమ్య, తిరునవల్లి నాగసాయి మహేశ్వరిలు ప్రతిభ చూపారన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు ముంబయిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఏపీ నుంచి ప్రాతినిధ్య వహిస్తారన్నారు. ఎంపికై న క్రీడాకారిణులను పలువురు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు.


