మట్టి తవ్వకాలపై తనిఖీలు
● త్రిపురాపురం మైనింగ్ క్వారీ వద్ద
అధికారుల కొలతలు
● సాక్షి కథనానికి స్పందన
నకరికల్లు: మండలంలోని త్రిపురాపురం మైనింగ్ క్వారీని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు సంయుక్తంగా ఆదివారం తనిఖీ చేశారు. ఎర్రమట్టి కొల్లగొట్టి రూ.కోట్లు దండుకుంటున్న పచ్చబ్యాచ్ అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి మూడు శాఖల అధికారులు స్పందించారు. మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ తిరుపతిరావు, ఆర్‌ఐ టి.సిద్దయ్య, నకరికల్లు ఎస్‌ఐ కె.సతీష్‌లు కలిసి త్రిపురాపురం కొండలో మట్టితవ్వకాలు జరుపుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. మైనింగ్ సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని కొలతలు తీసి హద్దులు నిర్ణయించారు.
షాడో ఎమ్మెల్యేల ఒత్తిడి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టితవ్వకాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. కానీ మట్టి క్వారీలో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో హద్దులు దాటి తవ్వకాలు జరిగినప్పటికీ షాడో ఎమ్మెల్యేల ఒత్తిడిలతో సదరు వాస్తవాన్ని బయటపెట్టేందుకు వెనుకాడినట్లు సమాచారం. చివరికి అక్రమ తవ్వకాలు జరగలేదని వారు నిర్ధారించారని స్థానికులు, విస్తుపోతున్నారు.
మట్టి తవ్వకాలపై తనిఖీలు


