షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు విశేష స్పందన
తెనాలిటౌన్: ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషస్పందన లభించిందని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు. ఈనెల 11న నిర్వహించనున్న ఈ పోటీల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మా–ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే భావనతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు మొత్తం 203 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. ఆయా షార్ట్ ఫిలింస్ జ్యూరీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పోటీలకు ఎంట్రీలు పంపిన ఔత్సాహికులు అందరికీ జనవరి 11న తెనాలిలో జరిగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కో– కన్వీనర్, సినీదర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ కోరారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటుడు మిలటరీ ప్రసాద్ పాల్గొన్నారు.


