2వ రోజుకు చేరిన పురుషుల బ్యాడ్మింటన్ పోటీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ 2026 పోటీలు ఆదివారం రెండవ రోజుకు చేరుకున్నాయి. సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ రెండవ రోజు పోటీలలో రెండు, మూడు రౌండ్లు పూర్తయ్యాయని, రెండవ రౌండ్‌లో మొత్తం 64 జట్లు పోటీ పడ్డాయని, వాటిలో 30 జట్లు గెలుపొందాయని పేర్కొన్నారు. రెండవ రౌండ్‌లో గెలుపొందిన 30 జట్లు ఆదివారం మధ్యాహ్నం మూడవ రౌండ్‌లో తలపడ్డాయని, 3వ రౌండ్‌లో ఆంధ్రాకు చెందిన జెఎన్‌టీయూ కాకినాడ జట్టు కర్ణాటకకు చెందిన గార్డెన్ సిటీ యూనివర్సిటీపై విజయం సాధించిందని వివరించారు. సోమవారం సెమీ ఫైనల్ అనంతరం మంగళవారం ఫైనల్ పోటీలు జరుగుతాయని హరికిషోర్ పేర్కొన్నారు.


