ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
నెహ్రూనగర్: ఆంధ్రప్రదేశ్‌లో ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సంపత్‌నగర్‌లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజధానిలో ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. బీసీ డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేట్ పదవుల్లో ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం పాల్గొన్నారు.


