పిల్లలు సైతం భాగస్వాములే
రసాయన ఎరువుల వినియోగం లేకుండా దేశీయ విత్తనాలతో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరలు, పండ్లు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. సాగుతో పొలంలో ధాన్యం, ఇతర పంటలు పండించే రైతుల కష్టం తెలుస్తోంది. నాతోపాటు మా పిల్లలను సైతం గార్డెన్‌లో మొక్కల పెంపకంలో భాగస్వాములను చేస్తున్నా. మా పిల్లలకు పని విలువ తెలపటంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతులను వివరిస్తున్నాను. రోజూ కూరగాయల కోసం పరుగులు పెట్టాల్సిన పని తప్పింది. మంచి ఆరోగ్యంతోపాటు డబ్బు, సమయం ఆదా అవుతోంది.
– దివ్యజ్యోతి, రేపల్లె


