మరింత విస్తరించేందుకు కృషి
దేశీయ విత్తనాల ఉత్పత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా పది మందితో గ్రూపు ప్రారంభించా. నిత్యం సాగు చేసే కూరగాయల యాజమాన్యంతోపాటు సేంద్రియ ఎరువుల తయారీపై అందరం చర్చించుకుంటాం. ఇలా సాగు చేసే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భవిష్యత్‌లో మరింత మందిని భాగస్వాములను చేస్తా. విద్యార్థులలో చైతన్యం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. దేశీయ విత్తన మొక్కలను 200 మందికి అందించా.
– కాళేపల్లి హరిణి,
గార్డెన్ బ్లూమ్స్ వ్యవస్థాపకురాలు


