వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు

Jan 5 2026 10:55 AM | Updated on Jan 5 2026 10:55 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి దివ్వెలకు స్వర్ణ నంది అవార్డు ప్రదానం వైభవంగా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం నేడు పోలీస్‌ గ్రీవెన్స్‌ తాత్కాలిక రద్దు

నరసరావుపేటరూరల్‌: వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేసిన ఘటన మండలంలోని ఇస్సపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు పది రోజుల క్రితం గ్రామంలోని దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహం వద్ద స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను ఫ్లెక్సీపై ముద్రించారు. అయితే ఈ ఫ్లెక్సీని శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించివేసారు. దీనిపై స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నరసరావుపేట రూరల్‌: ఆటోను లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కేసానుపల్లి సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు. ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన గూడూరు మరియల(50), కంభంపాటి దేవసహాయంతోపాటు పమిడిపాడుకు చెందిన మరో ముగ్గురు నెల్లూరు జిల్లా కావలిలో పాత రైస్‌మిల్‌లో సామాగ్రిని తొలగించే పనిని ఒప్పుకున్నారు. వీరు శనివారం రాత్రి నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వెళ్లేందుకు ఆటో ఎక్కారు. కేసానుపల్లి సమీపంలోని ఈశ్వర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఆటోను గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరియల గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ తెలిపారు.

సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన న్యాయవాది, ఆర్యవైశ్య నాయకుడు దివ్వెల శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలను గుర్తించిన విశ్వజనని ఫౌండేషన్‌ స్వర్ణ నంది అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆదివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సినీనటులుపూర్ణిమ, బాలాజీ, అంతర్ముఖం సినిమా హీరోయిన్‌ సృజన, ప్రముఖుల చేతులమీదుగా దివ్వెల శ్రీనివాసరావుకు అవార్డు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా దివ్వెలను పలువురు పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

ఫిరంగిపురం: మండలకేంద్రంలోని బాల ఏసు కథెడ్రల్‌ దేవాలయంలో ఆదివారం శ్రీసభలో క్రీస్తు సాక్షాత్కార (ముగ్గురు రాజుల పండుగ)మహోత్సవం నిర్వహించారు. దివ్యపూజాబలి నిర్వహించారు. బాల ఏసు కథెడ్రల్‌ దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి వాక్యోపదేశం చేశారు. దేవుని కుమారుడు మానవుడిగా జన్మించాడని చెప్పారు. ఆదినుంచి భగవంతుడు తన పవిత్రగంథం ద్వారా తన కుమారుడు భూమిపై లోక రక్షకుడిగా జన్మిస్తాడని తెలిపారన్నారు. పరలోక రాజ్యం యూదులకే కాదని ప్రతి ఒక్కరికి ఉందని.. అందుచేతనే దీనిని ముగ్గురు రాజుల పండుగగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భగవంతుడు భూమిపై ప్రతి ఒక్కరిని రక్షించేందుకు జన్మించాడన్నారు. సత్యం తెలియజేసేందుకు గాను మానవుడిగా క్రీస్తు జన్మించి దానిని ప్రతి ఒక్కరికీ తెలియజేసినట్లు చెప్పారు. అనంతరం దివ్యపూజాబలి నిర్వహించారు. సహాయ విచారణ గురువులు సాగర్‌, మఠకన్యా సీ్త్రలు, సోడాలిటీ సభ్యులు, ప్యారిష్‌ కౌన్సిల్‌, గుడిపెద్దలు, కథోలిక క్రైస్తవులు పాల్గొన్నారు.

నగరంపాలెం: ఈనెల ఐదో తేదిన గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నిర్వహించనున్న పీజీఆర్‌ఎస్‌ (గ్రీవెన్స్‌) అనివార్య కారణాలతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆదివారం జిల్లా పోలీస్‌ కార్యాయలం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని అన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు1
1/3

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు2
2/3

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు3
3/3

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement