ప్రమాదవశాత్తూ కాలువలో పడి వ్యక్తి మృతి
దుర్గి: మండల పరిధిలోని అడిగొప్పల గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి నాగార్జున సాగర్ కుడికాలువలో పడటంతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లి మండలం, పెదగార్లపాడు గ్రామానికి చెందిన పురంశెట్టి నాగరాజు(30) తన అత్తగారి గ్రామమైన దుర్గి మండల పరిధిలోని మించాలపాడు గ్రామంలో నివసిస్తూ స్థానిక డాల్ మిల్లులో పనిచేస్తుంటాడు. నూతన సంవత్సరం సందర్భంగా దుర్గి నుంచి తన స్వగ్రామమైన పెద గార్లపాడు వెళ్తున్న క్రమంలో అడిగొప్పల గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోవటంతో మృతి చెందాడు. గత మూడు రోజులుగా నాగరాజు ఆచూకీ కోసం బంధుమిత్రులు గాలిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం వాగులో మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. మృతుని భార్య హరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి బాబు, పాప ఉన్నారు.
ప్రమాదవశాత్తూ కాలువలో పడి వ్యక్తి మృతి


