ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పీఏ కిరణ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గెలుపొందిన ప్యానెల్ 2029 వరకు పని చేస్తుందని తెలిపారు. ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కోటంరాజు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎండీ గౌస్, వి.సర్వేశ్వర రెడ్డి, ఎస్.హీనాప్రియ, ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకట రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.భాస్కర రావు (డిప్యూటీ తహసీల్దార్), స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఎస్‌కే దరియా వలి, జాయింట్ సెక్రటరీలుగా డి.దివ్య దుర్గాదేవి (డిప్యూటీ తహసీల్దార్), కె.రాజీవ్ కుమార్, జె.రవికుమార్, ట్రెజరర్‌గా కె.గోపి ఎన్నికయ్యారు.


