భార్యను హతమార్చిన భర్త అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన భర్త అరెస్ట్‌

Jan 4 2026 10:57 AM | Updated on Jan 4 2026 10:57 AM

భార్య

భార్యను హతమార్చిన భర్త అరెస్ట్‌

భార్యను హతమార్చిన భర్త అరెస్ట్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ఐదుగురికి వారం రోజుల జైలు శిక్ష విద్యుత్‌ చౌర్యం నివారణకు చర్యలు తీసుకోవాలి 104 ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలి

చిలకలూరిపేటటౌన్‌: భార్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేసి, ఆమె మరణానికి కారణమైన నిందితుడిని చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈమేరకు చిలకలూరిపేట రూరల్‌ సీఐ కార్యాలయంలో మీడియా ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడు వివరాలు వెల్లడించారు.. వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్‌రాజు తన భార్య పుష్పపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలతో ఆస్పత్రి పాలైన పుష్ప చికిత్స పొందుతూ డిసెంబర్‌ 30వ తేదీన మృతి చెందింది. మృతురాలి తల్లి మంచాల సారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. ప్రెస్‌మీట్‌లో రూరల్‌ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్‌, లేఖా ప్రియాంక సిబ్బంది పాల్గొన్నారు.

నరసరావుపేట రూరల్‌: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందిన ఘటన మండలంలోని ఉప్పలపాడు సమీపంలో వై.జంక్షన్‌న్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన ఒంటిపులి కిరణ్‌(25), వల్లెపు కోటేశ్వరరావు(35)లు ద్విచక్రవాహనంపై వినుకొండ వైపు వస్తుండగా వై.జంక్షన్‌ వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ తెలిపారు.

గుంటూరు లీగల్‌: నగరంలో గత ఏడాది డిసెంబరు 31న ఈస్ట్‌, వెస్ట్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. డ్రైవ్‌లో 15 మంది మద్యం తాగినట్లు నిర్ధారించారు. వీరిలో పదిమందికి జరిమానా విధించి, మిగిలిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో కారు డ్రైవర్లు నలుగురు, బైక్‌ నడుపుతున్న ఒకరు ఉన్నారు. వీరు అధికంగా మద్యం తాగినట్లు ఉండటంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరో అదనవు జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్‌ గౌస్‌ విచారణ తర్వాత ఐదుగురికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

విద్యుత్‌ విజిలెన్స్‌ ఎస్‌ఈ మూర్తి

కొరిటెపాడు(గుంటూరు): సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (సీపీడీసీఎల్‌) పరిధిలో విద్యుత్‌ చౌర్యం అరికట్టేందుకు ప్రజలను చైతన్య పరిచాలని విద్యుత్‌ విజిలెన్స్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ కేవీఎల్‌ఎన్‌ మూర్తి సూచించారు. స్థానిక సంగడిగుంట విద్యుత్‌ భవన్‌లో విజిలెన్స్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ విద్యుత్‌ చౌర్యం చట్టరీత్యా నేరమన్నారు. గత ఏడాది 9,064 కేసులు నమోదు చేసి రూ.21.45 కోట్లు అపరాధ రుసుము విధించామని చెప్పారు. విద్యుత్‌ చౌర్యం అరికట్టడానికి గుంటూరు జిల్లా ఈఈ కరీమ్‌–94408 12263, పల్నాడు జిల్లా ఈఈ సుందరబాబు – 94910 66757, బాపట్ల జిల్లా ఈఈ భాస్కరరావు – 77804 56319లను సంప్రదించాలని సూచించారు.

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): 104 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బంది సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని 104 ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల సురేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం వైద్యరంగ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ పీహెచ్‌సీ సెంటర్‌ల వద్ద డిమాండ్స్‌తో కూడిన పోస్టర్లు అంటించి యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ అరకొర వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అరబిందో నుంచి రావాల్సిన బకాయిలు గ్రాడ్యూటీ, ఎర్న్‌ లీవ్‌ల డబ్బులు నేటికీ చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు ఇప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, కోశాధికారి ఐ.నాగులు, నాయకులు ఏడుకొండలు, సాయిరాం, బాలకృష్ణ, హరి, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

భార్యను హతమార్చిన  భర్త అరెస్ట్‌ 1
1/1

భార్యను హతమార్చిన భర్త అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement