కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు

Jan 3 2026 7:11 AM | Updated on Jan 3 2026 7:11 AM

కుక్క

కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు

కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు ఉచిత నర్సింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం నాన్‌టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి జాతీయ షూటింగ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

అమరావతి: మండల పరిధిలోని వైకుంఠపురం ఘాట్‌లో అదే గ్రామానికి చెందిన బాలుడు కృష్ణానదిలో గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ... వైకుంఠపురం ఎస్‌సీ కాలనీకి చెందిన నండూరు శివ (14) స్థానిక స్నానఘాట్‌ సమీపంలో దుస్తులు ఉతుకుతున్నాడు. ఇంతలో వెంట వచ్చిన పెంపుడు కుక్కపిల్ల నీటిలో మునిగిపోతుండటంతో రక్షించటానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అతడూ గల్లంతయ్యాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. శివకు మాటలు రావు. కొడుకు ఇలా నదిలో గల్లంతైన విషయం తెలుసుకుని శివ తల్లితండ్రులు చాణక్యరావు, ఝాన్సీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చిలకలూరిపేట: అసిస్ట్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌ (నర్సింగ్‌) కోర్సు శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి కె. డేవిడ్‌ తెలిపారు. నర్సింగ్‌ కోర్సుతో పాటు 4 నెలల ఉచిత కంప్యూటర్‌ కోర్సు, స్పోకెన్‌ ఇంగ్లిషు కూడా నేర్పుతామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్‌, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌లతో అడ్డరోడ్డు సెంటర్‌లో ఉన్న అసిస్ట్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. వివరాలకు ఫోన్‌ నంబర్లు 91826 34233, 89788 20317 లలో సంప్రదించాలన్నారు.

డీఈఓ రామారావు

నరసరావుపేట ఈస్ట్‌: పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం, ఏపీ మోడల్‌ స్కూల్స్‌ హాస్టల్స్‌లో ఖాళీగా ఉన్న టైప్‌–3, టైప్‌–4 బోధనేతర సిబ్బందిని పొరుగు సేవలు (ఔట్‌ సోర్సింగ్‌) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు జిల్లాలోని అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శుక్రవారం తెలిపారు. జిల్లా పరిధిలోని కేజీబీవీలలో టైప్‌–3లో 62, టైప్‌–4లో 38 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఓకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, అటెండర్‌, అకౌంటెంట్‌, కుక్‌, అసిస్టెంట్‌ కుక్‌, వాచ్‌ ఉమెన్‌, స్వీపర్‌ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. నియామకంలో రోస్టర్‌ పాయింట్స్‌ వర్తిస్తాయన్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 11వ తేదీలోగా తమ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలోని సమగ్ర శిక్ష విభాగంలో సమర్పించాలని తెలిపారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు జిల్లా నుంచి వీవీ అఖిల్‌రెడ్డి, కె.లక్ష్మీసాయిప్రవల్లిక ఎంపికయ్యారని గుంటూరు షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి అనిల్‌ తెలిపారు. గతనెల 25, 26 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వీరిద్దరూ జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు.

అఖిల్‌రెడ్డి

ప్రవల్లిక

కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు 1
1/2

కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు

కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు 2
2/2

కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement