కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు
నరసరావుపేట: కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కృతికా శుక్లాను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియచేశారు. కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ ఏకా మురళి, ఉద్యోగులు కలెక్టర్‌ను కలసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పారు. పలువురు జిల్లా అధికారులు తమ ఉద్యోగులతో కలెక్టర్‌ను కలిసి బొకేలు, నోటు పుస్తకాలు, మొక్కలు, విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల మెటీరియల్ పుస్తకాలు అందజేశారు. ఈవిధంగా సమకూరిన సుమారు 1300 నోటు పుస్తకాలు, 275 పాఠ్యపుస్తకాలను స్థానిక లైబ్రరీకి, వసతిగృహాల విద్యార్థులకు అందజేస్తామని కలెక్టర్ తెలియచేశారు. తనకు శుభాకాంక్షలు తెలిజేసేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నరసరావుపేట: రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావులు వేర్వేరుగా గురువారం ఆవిష్కరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజయకుమార్, ఇతర మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్లు కలెక్టర్, ఎస్పీలను వారి వారి కార్యాలయాల్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేశారు. ఈ సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరింప చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించి ప్రజల్లో భద్రతపై అవగాహన కలిగించాలని కోరారు.
కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు


