భువనేశ్వర్: లోక్ సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన జరిగిన 45వ సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్గం 6 శాఖలకు సంబంధించిన 11 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలపై ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ మీడియాకు వివరించారు. మంత్రి వర్గం ఆమోదం తెలిపిన 11 ప్రతిపాదనల్లో అత్యధికంగా 5 జల వనరుల శాఖకు సంబంధించినవి కాగా గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన 2 ప్రతిపాదనలు ఆమోదించారు. ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, వ్యవసాయ, రైతుల సాధికారత శాఖల నుండి వచ్చిన ఒక్కో ప్రతిపాదనకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మొత్తం మీద ఈ సమావేశంలో కేబినెట్ 6 శాఖల నుంచి వచ్చిన 11 ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించింది.


