రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కుచేయిపొదొరో గ్రామంలోకి అడవి జింక ప్రవేశించింది. గ్రామస్తులు దీనిని చూసి వెంటనే టికిరి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చిన పట్టుకున్నారు. జింక కాలుకు గాయమైనట్టు గుర్తించిన అటవీ సిబ్బంది పశువుల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అది కొలుకున్న అనంతరం తిరిగి అడవిలో విడిచిపెడతామని అధికారులు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ మన బాధ్యతగా వ్యవహరించిన గ్రామస్తులను అధికారులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు
రాయగడ: జిల్లాలోని గునుపూర్ సబ్ డివిజన్ పరిధి పుటాసింగ్ పోలీస్‌స్టేషన్ ఆరాడులోని ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బైకు అదుపుతప్పి సుమారు 40 అడుగుల లోయలోకి పడిపోవడంతో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది. మృతుడు గజపతి జిల్లా కాసీనగర్ సమితి పరిధిలోని అరమడ గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్ లిమా (30)గా గుర్తించగా.. తీవ్రగాయాలతో బయటపడిన వ్యక్తి అశ్విని జెన్నగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇద్దరినీ లోయ నుంచి బయటకు తీసి గుణుపూర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు ప్రదీప్ కుమార్ లిమను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. గాయపడిన అశిని జెన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఇద్దరూ గుణుపూర్‌లోని ఆర్‌కే టెంట్ హౌప్‌లో ఉద్యొగులుగా పనిచేస్తున్నారు. బకాయి నగదు వసూళ్లు చేసేందుకు సర్గియాసింగ్ గ్రామానికి బైకుపై వెళుతుండగా ఆరాడుల్ ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
నీళ్ల ట్యాంక్ నుంచి కింద పడి జేసీబీ డ్రైవర్ మృతి
కొరాపుట్: నీళ్ల ట్యాంక్ నుండి ప్రమాదవశత్తు కింద పడి జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి జొడింగా గ్రామ పంచాయతీ నువాగాంలో ప్రభుత్వ వసుధ నీళ్ల ట్యాంక్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ నిర్మాణం పనుల్లో కలహండి జిల్లా నర్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పాణీ ముండా పంచాయతీకి చెందిన ద్రోణ మజ్జి (24) జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం నిర్మాణ పనులు చూడడానికి ట్యాంక్ పై భాగం కి వెళ్లి ప్రమాదవశాత్తు పై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.


