పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో భాగంగా భారత్ నషాముక్త అభియాన్ 2.ఓ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ఫర్‌మెటిక్ సెంటర్, ఎన్.ఈ.సీ అధికారి బాలకృష్ణ మూర్తి పాల్గొని ప్రారంభించారు. స్వాగత ఉపన్యాసం రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరక్టర్ దుర్గాప్రసాద్ పాడి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డీన్ (స్టూడెంట్సు)డా, రితీష్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల సేవనకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు.


