రథయాత్రకు తాళ్లు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రథయాత్రకు తాళ్లు సిద్ధం

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

రథయాత్రకు తాళ్లు సిద్ధం రథాల తయారీ వేగవంతం రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి స్వాతంత్య్ర స్ఫూర్తిజ్వాల ‘వందేమాతరం’

భువనేశ్వర్‌: త్వరలో ప్రారంభం కానున్న పూరీ శ్రీ జగన్నాథ స్వామి యాత్ర కోసం రథాల తాళ్లు పూరీకి చేరాయి. 8 అంగుళాల వెడల్పు, 220 అడుగులు లేదా 67 మీటర్ల పొడవున్న ఈ తాళ్లు పూరీలోని వీర్‌ ప్రతాప్‌పూర్‌లో ఉన్న ఒడిశా సహకార పీచు కార్పొరేషన్‌ సరఫరా చేసింది. ఆలయ కార్యాలయానికి చేరిన రథాల తాళ్లను ఆలయ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో సురక్షితమైన ప్రదేశంలో భద్ర పరిచేందుకు తక్షణ ఏర్పాట్లు చేశారు.

పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో రథయాత్ర కోసం జగన్నాథ, బలరామ, సుభద్ర రథాల పనులు వేగవంతం అయ్యాయి. వచ్చే నెల పదో తేదీకి కొత్త రథాల పనులు పూర్తి చేయడా నికి ఎక్కువ మంది వడ్రంగులను నియమించామని, అటవీ శాఖ రథాలకు కావాల్సిన కలప ను కూడా సమకూర్చినట్టు రథయాత్ర కమిటీ సభ్యులు తెలియజేశారు.

ఇచ్ఛాపురం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం సమీపంలో సుర్లా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన నిరంజన్‌ మహరణ(48) మృతిచెందాడు. ఒడి శా నుంచి ఇచ్ఛాపురం వస్తుండగా గుర్తు తెలి యని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నిరంజన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం బరంపురం తరలించినా ఫలితం లేకపోయింది. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నిరంజన్‌ పట్టణంలోని దానంపేటలో ఈ–సేవా కేంద్రం, ఫ్లెక్సీ యూనిట్‌ నిర్వహిస్తున్నాడు. భార్య సుజ్ఞాని, కుమారుడు శుభమ్‌ ఉన్నారు. నిరంజన్‌ మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం కుజ్జిపేట గ్రామ సమీపంలోని తాలిచెరువు గట్టుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గురువారం ఉదయం గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం చెరువు గట్టుపై వెళ్తుడగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ టవల్‌ చుట్టి ఉండటం, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా, ఇంకేదైనా కా రణముందా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం అర్బన్‌ : వందేమాతర గేయం స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని గాంధీ మందిర కమిటీ వక్తలు పేర్కొన్నారు. బ్రిటీష్‌ పాలకుల దురాగతాలను ఎదిరించేందుకు వందేమాతరం నినాదం అందరినీ ఏకం చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ 188వ జయంతి శుక్రవారం నిర్వహించారు. విగ్రహదాత డాక్టర్‌ నిక్కు అప్నన్నతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సురంగి మోహన్‌రావు, ఎం.ప్రసాదరావు, జామి భీమశంకర్‌, పైడి హరనాధరావు, చౌదరి రాధాకృష్ణ, కొంక్యాన మురళీధర్‌, కొంక్యాన వేణుగోపాల్‌, పొన్నాడ రవికుమార్‌, మహిబుల్లాఖాన్‌, పందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, పెంకి చైతన్యకుమార్‌, బుడుమశీరు సూర్యారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement