పర్లాకిమిడి: మొహర్రం పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహర్రం నుంచి ముస్లింలకు కొత్త లూనార్ క్యాలండర్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది జూన్ 16 నుంచి ముస్లిం కొత్త సంవంత్సరాది క్యాలండర్‌ను ప్రారంభించారు. మొహర్రం సందర్భంగా నూతన దుస్తులు ధరించి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొహర్రం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. స్థానిక ఉప్పరవీధిలోని జుమ్మా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం చేశారు.
జయపురంలో..
జయపురం: మొహర్రంను జయపురంలో ముస్లింలు సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. ప్రధానంగా షియా ముస్లింలో వందలాది మంది మహిళలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు శోభాయాత్ర లోపాల్గున్నారు. సంప్రదాయ బద్ధంగా నల్లని దుస్తులతో శుభాయాత్రలో పాల్గొన్నారు.


