భువనేశ్వర్: కటక్‌లోని ఓగల్‌పూర్ ప్రాంతంలో మహానదిలో వందలాది నాగ విగ్రహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో భక్తి, ఉత్సాహ వాతావర ణం నెలకొంది. స్థానిక యువకులు ఆ విగ్రహాలను వెలికి తీసి, పూజల కోసం ఒక శివాలయంలో ప్రతి ష్టించారు. ఈ విగ్రహాల మూలం స్పష్టంగా తెలియనప్పటికీ వాటిని దొంగిలించి ఉంటారని లేదా మతపరమైన కారణాల వల్ల విసర్జించి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఓగల్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు మహా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో వారి కాళ్లకు, చేతులకు ఏదో గట్టి వస్తువు తగిలింది. వారు ఉత్సాహంగా దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాన్ని ఎత్తడానికి తమతో ఉన్న మరో ఆరుగురు స్నేహితులను పిలిచారు. మొదట 3 నుంచి 4 అడుగుల పెద్ద నాగ మూర్తి ఒకటి లభ్యమైంది. ఆ తర్వా త అక్కడ సుమారు 100 చిన్న నాగ మూర్తులు దొరికాయి. ఆ విగ్రహాలను ఒడ్డుకు తరలించి ధూప, దీపాదులతో పూజార్చనలు చేశారు. అనంత రం వాటిని ఓగల్‌పూర్ సంభేశ్వర్ దేవ్ శివాలయానికి తరలించారు. ఎవరో ఈ విగ్రహాలను దొంగి లించి మహా నదిలో రువ్వేసి ఉంటారని భావిస్తున్నా రు. శివాలయంలో భద్ర పరిచిన నాగ మూర్తులను భవిష్యత్‌లో ఆలయ కమిటీకి అప్పగిస్తామని యువకులు తెలిపారు.


