సీనియర్‌ జర్నలిస్ట్‌ శరత్‌ దాస్‌ కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్ట్‌ శరత్‌ దాస్‌ కన్నుమూత

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

సీనియర్‌ జర్నలిస్ట్‌ శరత్‌ దాస్‌ కన్నుమూత పుట్టగొడుగులు తిని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

భువనేశ్వర్‌: సీనియర్‌ జర్నలిస్ట్‌ శరత్‌ దాస్‌ (83) స్థాని క ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికి త్స పొందుతూ శుక్రవారం కన్ను మూశారు. ఆయన ఒడిశా మీడియా వర్గాలలో సుప్రసిద్ధ, గౌరవనీయ వ్యక్తిగా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలు ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (పీటీఐ) ఒడిశా బ్యూరో చీఫ్‌గా పని చేశారు. తన విశ్వసనీయమైన, ప్రభావవంతమైన రిపోర్టింగ్‌తో ప్రత్యేకత చాటుకున్నారు. తన వృత్తి జీవితంలో పలువురు యువ విలేకరులకు మార్గదర్శకత్వం వహించి, ఒడిశాలో ఆంగ్ల, జాతీయ స్థాయి జర్నలిజానికి గణనీయమైన కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహోద్యోగులు, మీడియా నిపుణులు ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయం పట్ల ఆయనకున్న వృత్తి నైపుణ్యం, నిజాయితీ, నిబద్ధతను గుర్తు చేసుకున్నారు.

రాయగడ: జిల్లాలొని కళ్యాణసింగుపూర్‌ సమితి కొత్తగూడ గ్రామంలోని కుంభారివీధిలో విషపూరిత పుట్టగొడుగులు తిని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. అడవిలో నుంచి తీసుకువచ్చిన గుర్తు తెలియని పుట్టగొడుగులను ఇంట్లో పెద్దలు లేని సమయంలో చూసి చిన్నారులు వండి తిన్న అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. అస్వఽస్థతకు గురైన చిన్నారులను వెంటనే కళ్యాణసింగుపూర్‌ ఆర్యోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స అనంతరం ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement