ఆనందం..‘ఆహ్లాద్‌’కరం | - | Sakshi
Sakshi News home page

ఆనందం..‘ఆహ్లాద్‌’కరం

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఆహ్లాద్‌–2కే26 కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్‌ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్‌.ఎల్‌.నాయుడు, ప్రిన్సిపాల్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ డి.యుగంధర్‌ నేతృత్వంలో జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాలు ప్రారంభించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శనివారం ముగింపు సందర్భంగా భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.కె.ప్రసాద్‌, వర్ధమాన సినీ నటి రాశీసింగ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు, కళాత్మక అభిరుచులు, వివిధ క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు తమ కళాశాలలో కొత్తగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు డైరెక్టర్‌ వెల్లడించారు. కళాశాలలో నిర్వహించిన ఆహ్లాద్‌ కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement