రాయగడ: జిల్లాలోని గుణుపూర్ ఏ–జోన్ జిల్లా పరిషత్ సభ్యుడుగా విధులు నిర్వహిస్తున్న రంజన్ గొమాంగో (45) శుక్రవారం అకాల మరణం చెందారు. కొద్ది నెలలుగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలియజేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు . ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రంజన్ గొమాంగో మృతికి పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
కొరాపుట్ డీఐపీఆర్వో మృతి
కొరాపుట్: జిల్లా పబ్లిక్ రిలేషన్ అధికారి (డీఐపీఆర్వో) స్వరాజ్ సిసా (42) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వరాజ్ శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. అయితే అప్పటికే స్వరాజ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంత్యక్రియలు కోసం స్వస్థలం కుమిలి ప్రాంతానికి తరలించారు. ఈయన మృతిపై పాత్రికేయులు నివాళులర్పించారు.
రైల్వేస్టేషన్‌ను
పరిశీలించిన డీఆర్‌ఎం
పర్లాకిమిడి: ఈస్టుకోస్టు రైల్వే డివిజన్, విశాఖపట్నం నుంచి ఒడిశాలో రాయఘడ రైల్వేడివిజన్ ప్రత్యేకంగా ఏర్పడిన తరువాత తొలిసారిగా రాయగడ రైల్వే డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్ శుక్రవారం గుణుపురం, పర్లాకిమిడి సేష్టన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. భారత్ అమృత్ స్టేషన్ల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో పర్లాకిమిడి వచ్చినట్టు చెప్పారు. గుణుపురం, పూరీ, విశాఖపట్నం నుంచి గుణుపురం ప్యాసింజర్ రైలు కొన్నిరోజులుగా ఆలస్యంగా (రెండు, మూడు గంటలు) ఇక్కడికి చేరుతున్నాయని.. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ నౌపడ నుంచి గుణుపురానికి సింగల్ లైన్, చిన్న స్టేషన్లలో గేట్లు సిగ్నలింగ్ సరిగ్గా లేనందున ఆలస్యం అవుతుందన్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అలాగే పర్లాకిమిడి, గుణుపురం నుంచి ఇక్కడి రైల్వేలైన్ రాయగడ డివిజన్ తెరువళ్లికి ఎప్పుడు కలుపుతారన్న ప్రశ్నకు బదులిస్తూ.. తెరువళ్లికి రైల్ లైన్ పొడిగింపునకు టెండర్లు పిలిచామన్నారు. సర్వే పనులు పూర్తయ్యినట్టు తెలియజేశారు. భూసేకరణ పూర్తయిన తరువాత రైల్వే లైను పొడిగింపు జరుగుతుందని అన్నారు. తెరువెళ్లికి రైల్వే లైను పోడిగింపుతో రాయపూర్, భిలాయికి కనెక్టు అవుతోందన్నారు.
బూటకపు ఐఏఎస్ అధికారి అరెస్టు
భువనేశ్వర్: తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న బూటకపు ఐఏఎస్ అధికారిని షహీద్ నగర్ ఠాణా పోలీసులు శుక్ర వారం అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
నాటుసారాతో ముగ్గురు అరెస్టు
జయపురం: చట్ట విరుద్ధంగా నాటుసారా అమ్ముతున్న ముగ్గురుని అరెస్టు చేసినట్లు జయపురం ఎకై ్సజ్ అధికారి సుబ్రత్ కేశరి హరిన్ తెలిపారు. అరైస్టెనవారిలో జయపురం సమితి టంకువ పంచాయతీ ఝింకురిగుడ గ్రామానికి చెందిన హరి పొర, ఘివురి, రాణిపుట్ గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గిరిపై కేసులు నమోదు చేశారు.


