రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణవేంకటేశ్వర మందిరం 32వ వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిర ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం విశ్వక్సేణ ఆరాధన, పుణ్యాహావచనం, పరిషత్, రుత్విక్ వరుణ, రక్షాసూత్రధారణ, మత్సంగ్రహణం, వాస్తు యోగీశ్వర పూజలు జరిగాయి. మందిరం పరిశీలన కమిటి అధ్యక్షులు చంద్రమౌళి కుముంధాన్, కార్యదర్శి శ్రీనివాస్ కుముంధాన్, సభ్యులు వడ్డాది శ్రీనివాస్ రావు, కొత్తకొట గౌరీశంకర్ పాల్గొన్నారు.
నేటి పూజా కార్యక్రమాల వివరాలు
ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాత్తుమురై, అంకురారొహణం, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, మూర్తి కుంభరాధన, పతాక ధ్వజ ప్రతిష్టాపనలు, గరుడధ్వజారోహణం, ఉదయం తొమ్మిది గంటలకు శ్రీసత్యానారాయణ స్వామి వ్రతములు, సాయంత్రం ఐదు గంటలకు ఎదుర్కోలోత్సవం, 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి ఎనిమిది గంటలకు శ్రీవారి శేషవాహనోత్సవం, విశేష హోమాలు, నీరజన మంత్రపుష్పములు, ప్రసాద సేవన కార్యక్రమాలు కొనసాగుతాయి.


