కొరాపుట్: కాలేజీల ప్రాంగణాల వద్ద ప్రతిపక్ష బీజేడీ పార్టీ హెల్ప్ డెస్క్‌లు ప్రారంభమయ్యాయి. కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్లస్ 2, ప్లస్ 3 విభాగాలకు బోధనా తరగతులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా విద్యార్థులు కళాశాలలకు చేరుకుంటున్నారు. వీరికి పట్టణాల్లో పరిస్థితులు, తరగతులు, ముఖ్య విభాగాలపై అవగాహన అంతగా ఉండదు. అటువంటి వారికి అవగాహన కల్పించడానికి బీజేడీ యువ, విద్యార్థి విభాగాలు ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డి.ఎ.వి కళాశాల ఎదుట జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక ఈ శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, తదితరులు పాల్గొన్నారు.


