శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ఘనంగా నివాళులు | - | Sakshi
Sakshi News home page

శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ఘనంగా నివాళులు

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

55 ఫోన్ల అందజేత

కొరాపుట్‌: జన సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని మంగళవారం బీజేపీ నాయకులు నిర్వహించారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని మజ్జి గుడలో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్‌ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. దేశ ఐక్యత కోసం శ్యాం ప్రసాద్‌ కన్న కలలను రాష్ట్ర ప్రాథమిక విద్య, మైనారిటీ శాఖ మంత్రి నిత్యానంద గొండో గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నబరంగ్‌పూర్‌ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి పాల్గొన్నారు.

● ఝార్సుగుడలో మొబైల్‌ హ్యాండోవర్‌ మేళా

రాయగడ: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్‌ ఫొన్లను గుర్తించి వాటిని అసలు యజమానులకు తిరిగి అందించే లక్ష్యంతో ఝార్సుగుడ పోలీసులు మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలొ నాలుగో విడత మొబైల్‌ హ్యాండోవర్‌ మేళాను నిర్వహించారు. ఆపరేషన్‌ నేత్ర కింద చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ విడతలో మొత్తం 55 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులకు అప్పగించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ జి.ఆర్‌.రాఘవేంద్ర పాల్గొని మోబైల్‌ యజమానులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదివరకు నిర్వహించిన మూడు విడతల మోబలై హ్యాండోవర్‌ మేళాల్లో 269 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని సంబంధిత వ్యక్తులకు అందించినట్లు వివరించారు. నాలుగో విడతలో లక్ష్మణ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అత్యధికంగా 13 మోబైల్‌ ఫోన్లు, ఝార్సుగుడ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 12 ఫోన్లను రికవరీ చేయగా మిగిలిన ఫోన్లు బ్రజరాజ్‌నగర్‌, బడ్మాల్‌, ఓరియంట్‌, బెల్‌పహార్‌, బన్హార్‌పాలి, లపైకెరా, కొలాబిరా, రెంగాలి, ఎయిర్‌పొర్టు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గుర్తించబడ్డాయని తెలిపారు. ఇదిలాఉండగా మోబైల్‌ ఫోన్లు పోయినా లేదా చొరీకి గురైన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement