పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

రాయగడ: జిల్లా కేంద్రాస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపొవడంతో ఆందొళన చేపట్టారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా స్తంభించింది. రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి 2023 నవంబర్‌ నుంచి వేతనాలు సకాలంలో అందడం లేదని, ప్రస్తుతం వరుసగా మూడు నెలల జీతాలు బకాయిలు ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందిన వారంతా వివరించారు. ఈ విషయమై పలుసార్లు జిల్లా యంత్రాంగం, ఔట్‌సోర్సింగ్‌ సంస్ధ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపొయారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు జిల్లా ప్రధాన వైద్యాధికారికి మసోసారి వినతిపత్రం సమర్పించి వెంటనే బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 57 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement