మావోయిస్టుల డంప్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

కొరాపుట్‌ ఎస్పీ రోహిత్‌ వర్మ

కొరాపుట్‌:

మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కొరాపుట్‌ జిల్లా ఎస్పీ రోహిత్‌ వర్మ ప్రకటించారు. సోమవారం కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు జిల్లాలోని బొయిపరిగుడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి బడిపహడ్‌ పర్వత ప్రాంతంలోని దండకారణ్యంలో డీవీఎఫ్‌ దళాలు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం డంప్‌ను గుర్తించినట్టు చెప్పారు. ఇందులో ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, ఆరు కంట్రీ మేడ్‌ గన్స్‌, ఒక క్‌లైమర్‌ మైన్‌, కేజీ బరువు ఉండే పది టిఫిన్‌ బాక్సు బాంబులు, ఆరు ఐఈడీ బాంబులు, మావోయిస్టు కిట్‌ బ్యాగ్‌, మావోయిస్టు సాహిత్యం, మందులు, నిత్యావసర వస్తువులు లభించినట్టు ఎస్పీ చెప్పారు. ఈ డంప్‌ ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీకి చెందినదిగా పేర్కొన్నారు. ప్రస్తుతం దండకారణ్యంలో డీవీఎఫ్‌, ఎస్‌వోజీ దళాలు గాలింపులు కొనసాగిస్తున్నాయని ఎస్పీ రోహిత్‌ వర్మ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement