రాయగడ: జేకే గ్రూప్ మాజీ చైర్మన్, దివంగత హరిశంకర్ సింఘానియా 93వ జయంతిని పురస్కరించుకుని జేకేపూర్‌లోని జేకేపేపర్ మిల్లు ప్రాంగణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. రాయగడ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో మిల్లు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని మొత్తం 166 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. శిబిరాన్ని జేకేపేపర్ మిల్స్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వినయ్ ద్వివేది ప్రారంభించారు. కార్యక్రమంలొ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్) విశ్వజీత్ ద్వివేది, జనరల్ మేనేజరు (హెచ్ ఆర్ అండ్ డెవలప్‌మెంట్) సందీప్ పాండే, జేకే డిస్పెన్సరీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రావ్, డాక్టర్ కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రక్తసేకరణ ప్రక్రియను రాయగడ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం సమర్ధవంతంగా నిర్వహించింది. ఈ బృందంలో డాక్టర్ సుదీప్త కుమార్ రమ్, డాక్టర్ కె.నవీన్, ఉమాకాంత మిశ్రా, జగన్ రాజ్ పట్నాయక్, ఉషారాణి బెవురియా పాల్గొన్నారు. సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం పట్ల జేకే పేపర్ మిల్స్‌కు ఉన్న నిబద్దద్ధను ఈ రక్తదాన శిబిరం మరోసారి చాటి చెప్పిందని వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది అన్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


