పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి దయామయ పాఢి, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు. గుసాని సమితిలో పలు పంచాయితీల నుంచి 32 అభియోగాలు రాగా, అందులో వ్యక్తిగతం 18, గ్రామ సమస్యలకు సంబంధించినవి 14 ఉన్నాయి. వీటన్నిటినీ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అదేశించారు. గుసానిసమితి కార్యాలయం వద్ద పది మంది వృద్దులకు మధుబాబు పింఛన్లను, పది మంది అంగన్‌వాడీ వర్కర్లకు సెల్‌ఫోన్లను అందజేశారు. రైతులకు మట్టి పరీక్ష కార్డులును అందించారు. గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, బీడీవో గౌరచంద్ర పట్నాయక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


