పర్లాకిమిడి: జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధికారి, జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశానుసారం గుసాని సమితి గురండి గ్రామంలో ఉన్న శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో సోమవారం పోక్సో, కిశోర న్యాయం, సీపీసీ, పోక్సోలో చట్టం అనుసారం బాధితులకు నష్టపరిహారం ఎలా లభిస్తుంది అనే విషయంపై డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బిమర్ రౌళో అవగాహన కల్పించారు. ఆయనతో పాటు జిల్లా సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్‌కుమార్ మిశ్రా కూడా పోక్సో కేసులో బాధితులకు న్యాయం చేయగలిగేలా చట్టాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ న్యాయ సేవా ప్రాధికరణ సదస్సులో గురండి అసిస్టెంటు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ఎన్.విమల్, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అలాగే మహిళా స్వశక్తీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు కూడా ప్రజలకు వివరించారు.


