పర్యావరణాన్ని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని పరిరక్షించాలి

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

పర్యావరణాన్ని పరిరక్షించాలి ఆగస్టు 16న ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరం

జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధి కుంభారి సాహీలో గల లక్ష్మణ బాలాజీ మంది రం ప్రాంగణంలో సోమవారం విద్యార్థులు వివిధ రకాల మొక్కలు నాటారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి వారు నిర్వహిస్తు న్న జయపురం సిటీ స్కూల్‌ విద్యార్థులు ఆల య ప్రాంగణంలో పలు రకాల పూల, ఫల మొ క్కలు నాటారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల కల్చరల్‌ ఉపాధ్యాయుడు ప్రతాప్‌ కుమార్‌ పట్నాయక్‌ నేతృత్వంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు ప్రశంసించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో అర్హులైన చేతులు లేని దివ్యాంగులను గుర్తించి, ఆగస్టు 16న విజయనగరంలో జరిగే ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి వారిని పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.దేవరాజుతో కలిసి కలెక్టర్‌ విడుదల చేశారు. విజయనగరం వెళ్లే ముందు జిల్లాలో ఒక స్క్రీనింగ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి, మోచేతి దిగువన నాలుగు అంగుళాల చేయి ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్‌ శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement