మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కార్యాలయం ప్రాంగణంలో సోమవారం కేంద్ర ప్రభుత్వానికి 12 ఏళ్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికాస్ ధారా.. ఒడిశా సా రా’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శా ఖల సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు ప్రయో జనాలను పంపిణీ చేశారు. సమితి అధ్యక్షుడు విఘ్న కిర్సాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమితి అభివృద్ధి అధికారి అర్పిత మహంతి, అతిథులు కలిసి గిరిజనులకు భూ పట్టాలు, పింఛన్లు మంజూరు పత్రాలు, అంత్యోదయ గృహ పథకం కింద ఇళ్ల కేటాయింపు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫోన్లు, చేపల పెంపకం కోసం లబ్ధిదారులకు ఆర్థిక సహయం అందజేశారు. మిషన్‌శక్తి మహిళ సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అధికారులు సందర్శించారు. సమితి అదనపు అభి వృద్ధిశాఖ అధికారి కార్తిక్ నాయక్, ఖోయిర్‌పూట్ సర్పంచ్ దైమతి గోల్పేదా, దుష్మంత్ బెహరా పాల్గొన్నారు.


