ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జయపురం: రాష్ట్రంలో సీఎం మోహణ చంద్ర మఝి నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ బీజేపీ సర్కార్‌ రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని కొట్‌పాట్‌ బీజేపీ ఎమ్మెల్యే రూపు బొత్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం జయపురం సబ్‌డివిజన్‌ బొరిగుమ్మ సమితి కార్యాలయ సభాగృహంలో ‘వికాశర ధార, ఒడిశా సారా’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రూపు భోత్ర ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల బీజేపీ పాలనలో అనేక అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత, గౌరవం ఇచ్చిందన్నారు. బొరిగుమ్మ సమితి అధ్యక్షురాలు దీప్తి మయీ నాయక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జయపురం ఎమ్మెల్యే ప్రతినిధి అశోక్‌ కుమార్‌ గంతాయిత్‌, కొరాపుట్‌ ఎంపీ ప్రతినిధి శ్రీనివాస రావు, బీడీఓ సుకాంత కుమార్‌ పట్నాయక్‌, సీడీపీఓ లక్ష్మీప్రియ మఝి, తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయ గ్రూపు మహిళలు, ఆరోగ్య, శిశు సంక్షేమ విభాగాలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. ఒడిశా జీవికా మిషన్‌ తరఫున మహిళలకు సహాయ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఒడిశా జీవిక మిషన్‌ అధికారి దేవేంద్ర పండా, జీపీడీఓ స్వాగతిక గోపాల్‌, బీఎస్‌ఎస్‌ఓ చంద్రికా ఖండేల్‌కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement