అంతర్జాతీయ యోగా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ యోగా దినోత్సవం

Jun 22 2026 12:06 AM | Updated on Jun 22 2026 12:06 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరిలో జిల్లా పరిపాలన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ సమితి ఒడిశా సహకారంతో స్థానీక బహుళ ప్రయోజన ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిధిగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మడ్కామి హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే కూడా పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా దోహదపడుతుందని వక్తలు తెలిపారు.

జయపురంలోని సంస్థల ఆధ్వర్యంలో..

జయపురం: జయపురంలో పలు సంస్థలు అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించాయి. వాటిలో సోషియల్‌ ఎన్విరాన్‌మెంటల్‌, ఎడ్యుకేషనల్‌, వెల్ఫేర్‌ అసోషియేషన్‌(సీవా)సభ్యులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బిజూ స్మృతి కమిటీ వారు బిజూ భవణంలో యోగా శిబిరం నిర్వహించారు. స్థానిక పతంజలి యోగా సంస్థ వారు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించారు. జయపురం జిల్లా న్యాయ స్థానం ప్రాంగణంలో కొరాపుట్‌ జిల్లా జడ్జి ప్రదీప్‌ కుమార్‌ మహంతి పర్యవేక్షణలో అన్ని కోర్టుల జడ్జిలు న్యాయవాదులు కోర్టుల సిబ్బంది పాల్గొని యోగా చేశారు.

జయపురంలో..

జయపురం: తెలుగు సాంస్కృతిక సమితి వారు జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యాయురాలు రీటా సామంతరాయ్‌ పర్యవేక్షణలో జరిగిన యోగా శిబిరంలో ఆమె యోగా గురించి వివరించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొని యోగాభ్యాసం చేశారు.

గజపతి జిల్లాలో..

పర్లాకిమిడి: పర్లాకిమిడి గజపతి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ఉదయం అధికారులు ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా చేయడం అలవర్చుకోండి... ఆరోగ్యంగా ఉండండి.. కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌ అన్నారు. ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి దయామయ పాఢి, జిల్లాముఖ్య అటవీ శాఖా అధికారి కె.నాగరాజు, పురపాలక అధ్యక్షు

రాలు నిర్మలా శెఠి తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా చెలిగడకు చెందిన యోగా భ్యసకులు లోకనాథ్‌ దండసేన, పతంజలి యోగా సమితి సభ్యులు సురేంద్ర రథ్‌, మహిళా యోగా శిక్షకులు ఆశాలతా అమ్మన్న, సి.సి.డి. సంస్థ ఎ.జగన్నాధ రాజులు పాల్గొన్నారు. చంద్రగిరి వద్ద జిరంగో టిబెటియన్‌ మానాస్ట్రీ వద్ద బౌధ్ధ మందిరం వద్ద యోగా దినోత్సవం జరుపుకున్నారు.

రాయగడలో..

రాయగడ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక అంబాగుడలో గల బిజుపట్నాయక్‌ ఇండోర్‌ స్టేడియంలొ జిల్లా యంత్రాంగం ,క్రీడా శాఖ సంయుక్తంగా నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్‌ నవీన్‌ చంద్ర నాయక్‌, గౌరవ అతిథిగా ఎస్‌డీసీ ఉపాధ్యక్షురాలు మంజుల మినియాక, జిల్లా క్రీడాధికారి షేక్‌ ఆలీనూర్‌, జిల్లా సమాచార, ప్రజాసంబంధాల శాఖ అధికారి దేవరాజ్‌ టక్రీ తదితరులు హాజరయ్యారు. వారు యోగా ప్రాముఖ్యతను వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement